స్పౌజ్‌ కేటగిరీ తేలకుండానే కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-12-30T18:22:51+05:30 IST

లోకల్‌ కేడర్‌లో ఉ పాధ్యాయులకు పోస్టుల కేటాయింపు ప్రక్రియలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

స్పౌజ్‌ కేటగిరీ తేలకుండానే కౌన్సెలింగ్‌

ఉపాధ్యాయ సంఘాల ఆందోళన

వరంగల్‌ సిటీ, డిసెంబరు 29: లోకల్‌ కేడర్‌లో ఉ పాధ్యాయులకు పోస్టుల కేటాయింపు ప్రక్రియలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భాగస్వా మి  (స్పౌజ్‌) కేటరిగిలో భారీగా అభ్యంతరాలు రావడంతో విద్యాశాఖ డైరెక్టర్‌ మంగళవారం కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. కాగా, బుధవారం నోడల్‌ జిల్లాకు ఉ మ్మడి జిల్లా నుంచి వివిధ కేటగిరీల్లో 925 అభ్యంతరా లు రాగా, వాటిని పరిశీలించి అర్హమైన వాటిని రాష్ట్ర వి ద్యాశాఖాధికారులకు పంపించారు. వరంగల్‌ జిల్లాలో 30, ములుగులో 95, జయశంకర్‌ భూపాలపల్లిలో 59 భాగస్వామి కేసులు, జనగామ, మహబూబాబాద్‌ జి ల్లాల్లో సైతం 25కుపైగా భాగస్వామి కేటగిరీలో అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తుంది. వీటన్నింటిని పరిశీలిం చి ఉన్నతాధికారులకు పంపించినట్లు పేర్కొన్నారు. 


రాత్రికి రాత్రే కౌన్సెలింగ్‌

బుధవారం సాయంత్రం వరకు అధికారులు ఉపాధ్యాయుల నుంచి వచ్చిన వివిధ రకాల అభ్యంతరాల ను పరిశీలించి అర్హత గల అభ్యంతరాలను రాష్ట్ర విద్యాశాఖాధికారులకు పంపించారు. కౌన్సెలింగ్‌ ప్రారంభించి తెల్లారేసరికి పోస్టుల కేటాయింపులు పూర్తి కావాలని విద్యాశాఖ డైరెక్టర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయని వరంగల్‌, హనుమకొండ జిల్లాల ఇంచార్జి డీఈవో వాసంతి, రంగయ్యనాయుడు కౌన్సిలింగ్‌ను ప్రారంభిచారు. కాగా, జనగామ, మహబూబాబాద్‌, భూపాలపల్లి, ములుగు  లో మాత్రం కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించలేదు. 


రెండు జిల్లాల్లో పూర్తి

వరంగల్‌, హనుమకొండ జిల్లాకు ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు బుధవారం జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల్లో వేర్వేరుగా రాత్రి 8 గంటల నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభించారు. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గోపి, అడిషనల్‌ కలెక్టర్‌ హరిసింగ్‌, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతల సమక్షంలో డీఈవో డి.వాసంతి కౌన్సెలింగ్‌ ప్రారంభించారు. హనుమకొండ జిల్లాలో అడిషనల్‌ కలెక్టర్‌ సంధ్యారాణి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమక్షంలో ఇన్‌చార్జి డీఈవో బి. రంగయ్యనాయుడు కౌన్సెలింగ్‌ ప్రారంభించారు. అన్ని కేటగిరిల్లో పోస్టులు కేటాయింపు పూర్తయ్యే వరకు కౌన్సెలింగ్‌ కొనసాగిస్తామని అధికారులు చెప్పారు. 


అయోమయం.. గందరగోళం..

భాగస్వామ్య కేటగిరీపై ఇంకా స్పష్టత రాకముందే వరంగల్‌, హనుమకొండ జిల్లాల డీఈవోలు  కౌన్సెలింగ్‌ ప్రారంభించడం పట్ల వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. మిగతా జిల్లాలకు రాని ఆదేశాలు రెండు జిల్లాల అధికారులకు మాత్రమే వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు. ఏకపక్షంగా కౌన్సిలింగ్‌ నిర్వహించడాన్ని వారు తప్పుబడుతున్నారు.

Updated Date - 2021-12-30T18:22:51+05:30 IST