టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పనులను పరిశీలించిన మండలి ఛైర్మన్

ABN , First Publish Date - 2021-02-09T00:47:50+05:30 IST

ఈ నెల 10తేదీన జరిగే టి ఆర్ యస్ పార్టీ భారీ బహిరంగ సభ స్థలిలో జరుగుతున్న పనులను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్

టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పనులను పరిశీలించిన మండలి ఛైర్మన్

హాలియా్: ఈ నెల 10తేదీన జరిగే టి ఆర్ యస్ పార్టీ భారీ బహిరంగ సభ స్థలిలో జరుగుతున్న పనులను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పర్యవేక్షించారు. సభ సమయం దగ్గరపడుతున్న నేపధ్యంలో త్వరగా పనులను పూర్తి చేయించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా ఎస్పీ రంగనాథ్ ను ఆదేశించారు. సభకు దాదాపు 2 లక్షలకుపైగా ప్రజలు హాజరుఅయ్యే అవకాశం ఉన్నందున ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభ ప్రాంగణంలో ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.


ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ తో పాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్,సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,నల్గొండ జడ్పి ఫ్లోర్ లీడర్ పాశం రాం రెడ్డి, నాగార్జున సాగర్ నాయకులు,నోముల భగత్ కుమార్, కోటి రెడ్డి ,గడ్డంపల్లి రవీందర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2021-02-09T00:47:50+05:30 IST