మార్కెట్లో పెరిగిన పత్తి ధర

ABN , First Publish Date - 2021-10-26T05:13:32+05:30 IST

మార్కెట్లో పెరిగిన పత్తి ధర

మార్కెట్లో  పెరిగిన పత్తి ధర

క్వింటాకు రూ.7,900 


వరంగల్‌ టౌన్‌, అక్టోబరు 25: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి ధర క్వింటాకు రూ.7,900 పలికింది. ఈ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి పత్తికి ఇంత ధర పలకడం ఇదే ప్రథమం. దీంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేశారు. పత్తి ఎగుమతులకు మంచి అవకాశం ఉండడంతోపా టు సీడ్‌ ధర, బేళ్ల ధర పెరగడంతో ముడిపత్తికి ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో పత్తి ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారవర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పంట చాలా వరకు దెబ్బతింది. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి అంచనా వేయగా ప్రస్తుత అంచనా ప్రకారం ఎకరానికి ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి గగనమంటున్నారు. 

Updated Date - 2021-10-26T05:13:32+05:30 IST