రికార్డు స్థాయిలో పత్తి ధర

ABN , First Publish Date - 2021-12-31T20:03:50+05:30 IST

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పత్తి క్వింటాకు గరిష్ఠంగా రూ.9001 ధర నమోదైంది.

రికార్డు స్థాయిలో పత్తి ధర

 కేసముద్రంలో గరిష్ఠంగా రూ.9001

వారంలో క్వింటాకు రూ.600 పెరిగిన రేటు

అంతర్జాతీయ మార్కెట్‌లో బేల్‌, గింజల ధరల ప్రభావం


కేసముద్రం, డిసెంబరు 30 : మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పత్తి క్వింటాకు గరిష్ఠంగా రూ.9001 ధర నమోదైంది. పత్తి దిగుబడులు తగ్గడం, జాతీయ మార్కెట్లో విపరీత డిమాండ్‌ ఉండడంతో కాటన్‌ ధర గత నెలలో తగ్గి మళ్లీ పైకి ఎగబాగుతోంది. గురువారం మార్కెట్‌కు 74 మంది రైతులు 234 క్వింటాళ్ల పత్తి తీసుకురాగా ఎలకా్ట్రనిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ (ఈ-నామ్‌) విధానంలో ఈ-వేలంలో క్వింటాకు గరిష్ఠంగా రూ.9001, కనిష్ఠంగా రూ.5411, సగటున రూ.8789 ధరలతో వ్యాపారులు ఖరీదులు చేశారు. వారం క్రితం సగటు ధర రూ.7900 నుంచి రూ.8000 మధ్యన ఉండగా తాజాగా సగటు ధరలురూ.8600 నుచి రూ.8700ల వరకు ఖరీదులుకొనసాగాయి. వారం వ్యవధిలో సగటు ధరలో క్వింటాకు రూ.600 వరకు  పెరగడం గమనార్హం.


పత్తి నుంచి ఉత్పత్తి అయ్యే బేల్‌ ధర అంతర్జాతీయ మార్కెట్లో గత వారం రూ.65,500 ఉండగా తాజాగా రూ.67,000కు చేరింది. అలాగే పత్తి నుంచి ఉత్పత్తి అయ్యే గిం జల ధర క్వింటాకు రూ.3000 ఉండగా రూ.3700లకు పెరిగింది. దీంతో మార్కెట్లో పత్తి ధరలు అమాంతం పెరుగుతున్నట్లు వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. అక్టోబరి చివరి వారం నుంచి నవంబర్‌ మొదటి వారం దాకా రూ.8800 వరకు పెరగడంతో పత్తి ధర రూ.10వేలను తాకుతుందని వ్యాపారులు భావించారు. అయితే నవంబర్‌ మొదటి వారం నుంచి పత్తి ధరలు స్వల్పంగా తగ్గి రూ.7700 సగటుకు చేరింది. తా జాగా మళ్లీ ధరలు పుంజుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బేల్‌ ధరల హెచ్చుతగ్గులను వ్యాపారులు అంచనా వేయలేకపోతున్నారు. దీంతో రాబో యే వారంలో పత్తి ధర పరిస్థితిని విశ్లేషించడం కష్టమని చెబుతున్నారు. 

Updated Date - 2021-12-31T20:03:50+05:30 IST