పంట పాడైందని.. ప్రాణం తీసుకున్నాడు !

ABN , First Publish Date - 2021-01-12T09:23:18+05:30 IST

భారీ వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో మనస్తాపానికి గురైన పత్తి రైతు ఉరేసుకున్నాడు

పంట పాడైందని.. ప్రాణం తీసుకున్నాడు !

అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య


హుస్నాబాద్‌, జనవరి 11: భారీ వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో మనస్తాపానికి గురైన పత్తి రైతు ఉరేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన పోలవేని నవీన్‌ (21) తండ్రి పోచయ్య కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో తల్లి విజయతో కలిసి తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది అప్పులు చేసి పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కూడా రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.  

Updated Date - 2021-01-12T09:23:18+05:30 IST