రైల్వేలో అవినీతి తిమింగలం

ABN , First Publish Date - 2021-11-02T08:56:49+05:30 IST

ఇద్దరు తెలుగు కాంట్రాక్టర్ల నుంచి 2011-2019 మధ్య రూ.1.29 కోట్ల లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై నైరుతి రైల్వే బెంగళూరు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఘనశ్యామ్‌ ప్రధాన్‌పై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

రైల్వేలో అవినీతి తిమింగలం

  • నైరుతి రైల్వే ఇంజనీర్‌ ఘనశ్యామ్‌ ప్రధాన్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌
  • ఇద్దరు తెలుగు కాంట్రాక్టర్ల నుంచి..
  • 1.29 కోట్ల లంచం తీసుకున్నారని ఆరోపణలు


న్యూఢిల్లీ, నవంబరు 1: ఇద్దరు తెలుగు కాంట్రాక్టర్ల నుంచి 2011-2019 మధ్య రూ.1.29 కోట్ల లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై నైరుతి రైల్వే బెంగళూరు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఘనశ్యామ్‌ ప్రధాన్‌పై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఘనశ్యామ్‌ ప్రధాన్‌తో పాటు తెలుగు కాంట్రాక్టర్‌ ఎం.సూర్య నారాయణరెడ్డి, ఆయన సంస్థ కృషి ఇన్‌ఫ్రాటెక్‌, మరో తెలుగు కాంట్రాక్టర్‌ వి.సూర్య నారాయణరెడ్డి పేర్లను ఈ కేసులో చేర్చినట్లు అధికారులు సోమవారం వివరించారు. 2011-2019 మధ్య కాంట్రాక్టర్ల బ్యాంకు ఖాతాల నుంచి ఘనశ్యామ్‌ ప్రధాన్‌, ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడ్డాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేసిన అనంతరం ఇటీవల బెంగళూరు, హుబ్లీ, మైసూరు, సాంగ్లీ, నంద్యాల, రంగారెడ్డి జిల్లా సహా మొత్తం 16 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-11-02T08:56:49+05:30 IST