టీచర్ల జాబితాను సరిచేయాలి: పీఆర్టీయూటీఎస్
ABN , First Publish Date - 2021-12-20T09:52:36+05:30 IST
ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో దొర్లిన తప్పులను సరిచేయాలని పీఆర్టీయూ టీఎస్ డిమాండ్ చేసింది.
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో దొర్లిన తప్పులను సరిచేయాలని పీఆర్టీయూ టీఎస్ డిమాండ్ చేసింది. తప్పుల తడకల జాబితాలతో కేటాయింపులు జరపడం ద్వారా టీచర్లకు తీవ్ర నష్టం జరుగుతుందని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా అధికారుల తీరు వల్ల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు అభిప్రాయపడ్డారు. నూతన జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపుల్లో స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోగా, సీనియారిటీ జాబితాను కూడా సమగ్రంగా తయారు చేయలేకపోయారని మండిపడ్డారు.