మూడు శాఖల ఉద్యోగులకు 11, 12 తేదీల్లో వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-02-09T04:16:26+05:30 IST

మూడు శాఖల ఉద్యోగులకు 11, 12 తేదీల్లో వ్యాక్సిన్‌

మూడు శాఖల ఉద్యోగులకు  11, 12 తేదీల్లో వ్యాక్సిన్‌

హన్మకొండ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రెవెన్యూ, పంచాయతీ, మునిసిపల్‌ ఉద్యోగులకు ఈనెల 11, 12వ తేదీల్లో కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం  పోలీసు సిబ్బందికి  వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఈ ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. మిగిలిన వారికి ఆ మర్నాడు వేస్తారు. ఆ తర్వాత కూడా వారికి వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంది. అయితే రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, మునిసిపల్‌ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌పై ఉమ్మడి జిల్లాలోని వైద్యఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు షెడ్యూల్‌ తయారు చేస్తున్నారు. గురు, శుక్ర వారాల్లో వారికి వ్యాక్సినేషన్‌ చేయడం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం ఒక్కో సెంటర్‌లో 100 మందికే టీకాలు ఇస్తున్నారు. ఈ సంఖ్యను 200లకు పెంచనున్నట్టు తెలుస్తోంది. వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఆయా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆయా పీహెచ్‌సీల పరిధిలో ఈ మూడ

Updated Date - 2021-02-09T04:16:26+05:30 IST