ఎంపీ రేవంత్‌కు కరోనా

ABN , First Publish Date - 2021-03-24T07:37:13+05:30 IST

మల్కాజ్‌గిరి ఎంపీ ఎనుముల రేవంత్‌ రెడ్డికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఎంపీ రేవంత్‌కు కరోనా

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మల్కాజ్‌గిరి ఎంపీ ఎనుముల రేవంత్‌ రెడ్డికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు తాను ఐసొలేషన్‌లో ఉన్నానని, కొద్ది రోజులుగా తనతో కాంటాక్టులో ఉన్నవారంతా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ట్విటర్‌ ద్వారా సూచించారు. కాగా, సోమవారం కొత్తగా మరో 412 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3,03,867కు పెరిగింది. మరో ముగ్గురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,674కు పెరిగింది. గత వారం రోజులుగా యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా అవి 3,151కు చేరాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 564 మంది, ప్రైవేటులో 1,302 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-03-24T07:37:13+05:30 IST