తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు

ABN , First Publish Date - 2021-03-22T17:19:22+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు రోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో...

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు రోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 37,079 మందికి కరోనా పరీక్షలు చేయగా.. పరీక్షల్లో కొత్తగా 337 కరోనా కేసులు నమోదైనట్లు సోమవారం వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‎లో తెలిపింది. 337 కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 91 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,03,455కు చేరింది. ఆదివారం కరోనా వైరస్‎తో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం రాష్ట్రంలో 1,671 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,958 యాక్టివ్‌ కేసులు ఉండగా.. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి నుంచి 2,98,826 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ రాష్ట్రంలో మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-03-22T17:19:22+05:30 IST