విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా

ABN , First Publish Date - 2021-12-25T08:06:35+05:30 IST

విదేశాల నుంచి శుక్రవారం రాష్ట్రానికి 883 మంది తిరిగి రాగా

విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా

  • కోలుకున్న పదిమంది ఒమైక్రాన్‌ రోగులు

 హైదరాబాద్‌, డిసెంబరు 24(ఆంఽధ్రజ్యోతి): విదేశాల నుంచి శుక్రవారం రాష్ట్రానికి 883 మంది తిరిగి రాగా.. వీరిలో ఐదుగురికి కొవిడ్‌ పాజిటి వ్‌గా నిర్ధారణ అయింది. వీరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపారు. ఇప్పటికే విశ్లేషణకు పంపిన నమూనాల్లో కొత్తగా ఒక్క ఒమైక్రాన్‌ కేసు కూడా రాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. పదిమంది ఒమైక్రాన్‌ రోగులు కోలుకున్నట్లు తెలిపింది.


ఇక రాష్ట్రంలో శుక్రవారం 35, 037 మందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు. 162 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. మరొకరు మృతి చెందారు. 3,547 కొవిడ్‌ కేసులున్నాయి.  కొత్తగా 3.32 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇందులో 2,66,939 మంది రెండో డోసు పొందారు. దుబాయి నుంచి ఈ నెల 19న తిరిగొచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి (38)కి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దుబాయ్‌ నుంచి వచ్చి.. ఒమైక్రాన్‌ పాజిటివ్‌గా తేలిన ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామ యువకుడు నారాయణపూర్‌లో తిరిగాడు. దీంతో బుధవారం నారాయణపూర్‌ వ్యక్తి పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ ఉన్నట్లు తేలింది.
ఏపీలో కొత్తగా 2 ఒమైక్రాన్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం రెండు ఒమైక్రాన్‌ కేసు లు నమోదయ్యాయి. కువైత్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన మహిళకు, దుబాయ్‌ నుంచి విశాఖపట్నం వచ్చిన యువకుడికి వైరస్‌ నిర్ధారణ అయింది.


Updated Date - 2021-12-25T08:06:35+05:30 IST