రాష్ట్రంలో మరో 135 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-10-25T08:31:09+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 135 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6.70 లక్షలకు పెరిగింది.

రాష్ట్రంలో మరో 135 మందికి కరోనా

హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కొత్తగా 135 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6.70 లక్షలకు పెరిగింది. కొవిడ్‌తో మరొకరు మృతిచెందడంతో, మొత్తం మరణాల సంఖ్య 3,947కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,950  యాక్టివ్‌ కేసులున్నాయి. హైదరాబాద్‌లో 64, రంగారెడ్డిలో 11  కొత్త కేసులు నమోదయ్యాయి. 12 జిల్లాలో సున్నా కేసులు రాగా, మిగిలిన చోట్ల పదిలోపు కేసులు వచ్చాయి. 

Updated Date - 2021-10-25T08:31:09+05:30 IST