కన్వేయర్‌ బెల్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

ABN , First Publish Date - 2021-06-23T05:18:29+05:30 IST

కన్వేయర్‌ బెల్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

కన్వేయర్‌ బెల్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

కృష్ణకాలనీ, జూన్‌ 22: మల్హర్‌ మండలంలోని తాడిచర్ల బ్లాకు నుంచి గణపురం మండలం చెల్పూరులోని జెన్‌కోకు బొగ్గు సరఫరాకు కొత్తగా కన్వేయర్‌ బెల్టును ఏర్పాటు చేయనున్నారు. భూపాలపల్లి మండలంలోని  జంగేడు, కొంపల్లి గ్రామాల పరిధిలో సుమారు 13 ఎకరాల భూమిని  రెవెన్యూ, సింగరేణి అధికారులు మంగళవారం పరిశీలించారు.  ఈ సందర్భంగా భూ నిర్వాసిత రైతులు అధికారులకు తమ గోడును వెల్లబుచ్చారు. భూముల విలువ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో  దాని అనుగుణంగా పట్టా భూములతో పాటు లావణి పట్టా భూములకు కూడా సమానంగా పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆర్డీవో శ్రీనివాస్‌ మాట్లాడుతూ  కన్వేయర్‌ బెల్టు ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపడతామన్నారు.  కన్వేయర్‌ బెల్టు కోసం 13 ఎకరాల భూమిని పరిశీలించామ తెలిపారు.   కార్యక్రమంలో జెన్‌కో సీఈ సిద్ధయ్య, ఎస్‌ఈ తిరుపత య్య, భూపాలపల్లి తహసీల్దార్‌ ఇక్బాల్‌, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ దేవేందర్‌, సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ రాములు, సర్వేయర్‌ స్టాలిన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-23T05:18:29+05:30 IST