ఆ జిల్లాలకు సాయం కొనసాగించండి: వినోద్
ABN , First Publish Date - 2021-12-31T08:15:21+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ఇస్తున్న నిధుల కాలవ్యవధిని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

న్యూఢిల్లీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ఇస్తున్న నిధుల కాలవ్యవధిని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ. 900 కోట్లు విడుదలకు చొరవ తీసుకోవాలని కోరారు. గురువారం ఆయన ఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఏటా రూ.450 కోట్ల చొప్పున 9 వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను కేంద్రం 2019-20 నుంచి విడుదల చేయటం లేదన్నారు.