ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కానిస్టేబుళ్లు బదిలీ

ABN , First Publish Date - 2021-11-03T05:04:17+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కానిస్టేబుళ్లు బదిలీ

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కానిస్టేబుళ్లు బదిలీ

హనుమకొండ క్రైం, నవంబరు 2: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌తో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 115 మంది పోలీసు కానిస్టేబుళ్లతో పాటు వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 33 మంది హెడ్‌కానిస్టేబుళ్లను వివిధ ప్రాంతాలకు బ దిలీ చేస్తూ వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుళ్ల విభాగంలో కమిషనరేట్‌ ప రిధిలో పనిచేస్తున్న 41 మందిని ములుగు, మహబూబాబా ద్‌, భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి వరంగల్‌ కమిషనరేట్‌కు 53 మంది కానిస్టేబుళ్లకు ఆయా జిల్లాల అధికారులు బదిలీ చేశారు. 33 మంది హెడ్‌కానిస్టేబుళ్లను కమిషనరేట్‌ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్‌లకు బదిలీ చేశారు.

 

Updated Date - 2021-11-03T05:04:17+05:30 IST