2023లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కే అధికారం

ABN , First Publish Date - 2021-10-20T08:43:15+05:30 IST

2023లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కే అధికారం

2023లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కే అధికారం

 రాజీవ్‌ గాంధీ సేవలు చిరస్మరణీయం 

 రాజీవ్‌ సద్బావన యాత్రలో వీరప్ప మొయిలీ 

 స్వార్ధశక్తులకు ప్రజలే గుణపాఠం చెప్పాలి: రేవంత్‌ రెడ్డి 


చార్మినార్‌, రాజేంద్రనగర్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే సమర్ధ యువ నాయకునిగా పేరు తెచ్చుకున్నారని కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ అన్నారు. మంగళవారం చార్మినార్‌ వద్ద రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్ర స్మారక సమితి అధ్యక్షుడు నిరంజన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, రాజీవ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక, రాజకీయ, సాహిత్య రంగాల్లో చేసిన సేవకు గుర్తింపుగా వీరప్ప మొయిలీకి సద్భావనా యాత్ర అవార్డును పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు ప్రదానం చేశారు. అనంతరం వీరప్ప మొయిలీ మాట్లాడుతూ... మహాత్మ గాంధీ మాదిరిగా రాజీవ్‌ కూడా దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్‌, ఇందిర సేవలు చిరస్మరణీయమన్నారు. 2023లో తిరిగి తెలంగాణ, ఏపీ  రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట ఈ రాష్ట్రాన్ని విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న స్వార్ధశక్తులకు రాష్ట్ర ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌ హనుమంతరావు, మల్లు భట్టి విక్రమార్క, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T08:43:15+05:30 IST