సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-12-26T17:18:17+05:30 IST

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఉద్రిక్తత

సిద్దిపేట: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమంపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఈ పరిస్థితి చోటు చేసుకుంది.రేపటినుంచి రేవంత్‌రెడ్డి రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ఏర్పాట్ల చేసేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నేతలను టీఆర్ఎస్‌ నేతలు అడ్డుకున్నారు.ఎర్రవల్లిలో కాంగ్రెస్ రచ్చబండ నిర్వహించవద్దని టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు పార్టీల్లోని నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసులు ఇరువురిని అడ్డుకుని సముదాయించే పనిలో ఉన్నారు. 

Updated Date - 2021-12-26T17:18:17+05:30 IST