కేంద్రం విధానాలపై కేసీఆర్‌ మౌనమేల..?

ABN , First Publish Date - 2021-07-13T05:22:52+05:30 IST

కేంద్రం విధానాలపై కేసీఆర్‌ మౌనమేల..?

కేంద్రం విధానాలపై కేసీఆర్‌  మౌనమేల..?
ర్యాలీలో మాట్లాడుతున్న శ్రీధర్‌బాబు

మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

కృష్ణకాలనీ, జూలై 12: కేంద్రం అవంలబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మౌనం పాటించడం విడ్డూరమని  మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. పెట్రోల్‌ ధరలపై భూపాలపల్లిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వినూత్న నిరసన కార్యక్ర మంలో స్వయంగా ఎండ్లబండిని నడుపుతూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ... కాంగ్రెస్‌ హయాంలోనే దేశం, రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని గుర్తు చేశారు. 2013లో పెట్రోల్‌ ధర రూ. 63 ఉంటే ప్రస్తుతం రూ. 100 పైచిలుకు పలుకుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పేద, మద్యతరగతి పజలు బతికే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గుతుంటే మన దేశంలో పెరుగుతున్నాయని ఆరోపించారు. పెంచిన డీజిల్‌, పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు  మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డి, నాయకులు ఇస్లావత్‌ దేవన్‌, బుచ్చయ్య, రాజేందర్‌తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-13T05:22:52+05:30 IST