ధాన్యం కొనుగోలుపై లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ ఉత్తమ్

ABN , First Publish Date - 2021-12-08T18:32:26+05:30 IST

ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు.

ధాన్యం కొనుగోలుపై లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ ఉత్తమ్

న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో డ్రామాలు చేసి వాకౌట్ చేశారని ఎంపీ ఉత్తమ్ విమర్శించారు. 


దీనిపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానమిస్తూ.... వరి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎఫ్‌సీఐ బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. బాయిల్డ్‌ రైస్‌ సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ అన్నారు.

Updated Date - 2021-12-08T18:32:26+05:30 IST