ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతా: ఎంపీ ఉత్తమ్

ABN , First Publish Date - 2021-12-25T22:33:02+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని కాంగ్రెస్ ఎంపీ

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతా:  ఎంపీ ఉత్తమ్

నల్గొండ: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మిర్యాలగూడ మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీఎల్ఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన 600ల హెల్మెట్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. వరి పంట కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాలను వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తామన్నారు.  ఎంపీ నిధుల నుంచి తక్కెళ్లపాడు గ్రామంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం రూ. 5లక్షల నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 


Updated Date - 2021-12-25T22:33:02+05:30 IST