పెద్దపల్లి ఘటన న్యాయ వ్యవస్థకే హెచ్చరికలా మారింది : జీవన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-02-26T16:34:29+05:30 IST

పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద‌ుల హత్య తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. దీనిపై ...

పెద్దపల్లి ఘటన న్యాయ వ్యవస్థకే హెచ్చరికలా మారింది : జీవన్ రెడ్డి

హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద‌ుల హత్య తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన న్యాయవ్యవస్థకే హెచ్చరికలా ఉందని వ్యాఖ్యానించారు. అక్రమ మార్గంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్‎కు నిధులు సమకూర్చుతున్నారని, న్యాయవాదులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకే న్యాయవాద దంపతులను హత్య చేశారని ఆరోపించారు. ఈ కేసులో ట్రస్ట్ నిర్వాహకులను ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు?. పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని, న్యాయవాదుల హత్యకు కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ హత్యలో టీఆర్ఎస్ పెద్దల ప్రోత్సాహం ఉందని, హత్యలను సీఎం కేసీఆర్ కనీసం ఖండించక పోవడం దారుణమని మండిపడ్డారు. న్యాయవాదుల హత్యలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కాగా.. ఈనెల 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో ప్రధాన రహదారిపై మంథని మండలం గుంజపడుగుకు చెందిన న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణిలు దారుణ హత్యకు గురయ్యారు.

Updated Date - 2021-02-26T16:34:29+05:30 IST