పోడు సమస్యపై కాంగ్రెస్ పోరాటం: ఎమ్మెల్యే సీతక్క

ABN , First Publish Date - 2021-11-09T23:22:57+05:30 IST

రాష్ట్రంలోని పోడు సమస్యపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే

పోడు సమస్యపై కాంగ్రెస్ పోరాటం: ఎమ్మెల్యే సీతక్క

హైదరాబాద్: రాష్ట్రంలోని పోడు సమస్యపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. కష్టకాలంలో కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కలిసి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునేది కాంగ్రెస్ పార్టీనేనని ఆమె ఉద్ఘాటించారు. పోడు భూములకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ అని ఆమె పేర్కొన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆదివాసీలను పోడు విధ్వంసకులు అంటున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. పోడు పట్టాలపై కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. 

 

Updated Date - 2021-11-09T23:22:57+05:30 IST