తీన్మార్‌దే నైతిక విజయం: రాజగోపాల్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-03-21T23:10:02+05:30 IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నదే నైతిక విజయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

నల్గొండ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నదే నైతిక విజయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య వ్యక్తి టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చాడని చెప్పారు. టీఆర్‌ఎస్ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసిందన్నారు. విపక్ష అభ్యర్థుల ఓట్ల చీలిక వల్లే టీఆర్‌ఎస్ గెలిచిందని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.