గవర్నర్‌తో టి.కాంగ్రెస్ నేతల భేటి
ABN , First Publish Date - 2021-02-26T15:28:01+05:30 IST
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో శుక్రవారం ఉదయం టీ.కాంగ్రెస్ నేతలు భేటి అయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో శుక్రవారం ఉదయం టీ.కాంగ్రెస్ నేతలు భేటి అయ్యారు. మంథనిలో హైకోర్టు న్యాయవాదుల జంట వామన్‌రావ్, నాగమణిల దారుణ హత్యలపై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ బృందం కోరింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.