రాజీవ్‌గాంధీకి కాంగ్రెస్‌ నేతల ఘననివాళి

ABN , First Publish Date - 2021-08-21T06:43:16+05:30 IST

దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్‌ నేతలు పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు.

రాజీవ్‌గాంధీకి కాంగ్రెస్‌ నేతల ఘననివాళి

ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో రక్తదానం

హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్‌ నేతలు పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైౖర్మన్‌ మధు యాష్కీ, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ఇతర నేతలు గీతారెడ్డి, మహేష్‌ కుమార్‌ గౌడ్‌, అంజన్‌ కు మార్‌ యాదవ్‌, అజారుద్దీన్‌, మల్లు రవి, నిరంజన్‌, బక్క జడ్సన్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో ఇందిరా భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించా రు. 

Updated Date - 2021-08-21T06:43:16+05:30 IST