జగన్‌పై వీహెచ్ పరోక్ష వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-15T18:35:35+05:30 IST

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సంస్మరణ సభలో ఏపీ సీఎం జగన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

జగన్‌పై వీహెచ్ పరోక్ష వ్యాఖ్యలు

హైదరాబాద్: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సంస్మరణ సభలో ఏపీ సీఎం జగన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి చేయకుండా రోశయ్యను కొందరు వేధించారని అన్నారు. ‘‘రోశయ్య తన ఆవేదనను నాతో వ్యక్తిగతంగా పంచుకున్నారు’’ అని తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయొద్దని రోశయ్యతో చెప్పానన్నారు. రోశయ్య రాజకీయాల్లో అజాతశత్రువని వీహెచ్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-15T18:35:35+05:30 IST