పోలీసుల ముళ్లకంచెలు మమ్మల్ని అపలేవు...మాకు తిక్కరేగితే: Revanth

ABN , First Publish Date - 2021-12-31T19:39:55+05:30 IST

కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి అన్నారు.

పోలీసుల ముళ్లకంచెలు మమ్మల్ని అపలేవు...మాకు తిక్కరేగితే: Revanth

హైదరాబాద్: కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి అన్నారు. రైతులను వరి వేయవద్దని.. తాను మాత్రం ఫామ్‌హౌస్‌లో వేశారని మండిపడ్డారు. కేసీఆర్ వరిసాగుపై ప్రజలకు చెబుతామనే నిర్బంధించారన్నారు. జీవో 317తో ఇష్టానుసారంగా ఉపాధ్యాయులను బదిలీ చేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారని... ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తే నిర్బంధిస్తారా? అని ప్రశ్నించారు. కనీసం సంబంధిత మంత్రి కూడా పరామర్శించరా అని నిలదీశారు. మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కేటీఆర్‌ ఎక్కడ కనబడితే అక్కడ సన్మానం చేయాలన్నారు. ‘‘పోలీసుల ముళ్లకంచెలు మమ్మల్ని అపలేవని...మాకు తిక్కరేగితే జైల్‌భరోకు పిలుపునిస్తాం’’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-12-31T19:39:55+05:30 IST