ఈటల ఎందుకు రాజీనామా చేసాడు: రాజనరసింహ
ABN , First Publish Date - 2021-07-28T01:16:00+05:30 IST
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేసాడో
ఇల్లందకుంట: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేసాడో సమాధానం చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ దామోదర రాజనరసింహ డిమాండ్ చేశారు. ఇల్లందకుంటలో రాజనరసింహ మాట్లాడుతూ ఈటల రాజీనామా ప్రజల కోసమా, తన వ్యక్తిగతమో సమాధానం చెప్పాలని రాజనరసింహ నిలదీశారు. రాజకీయ నాయకులకు వెలగట్టడం ఒక వ్యభిచారంలా మారిందని రాజనరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదన్నారు. దళిత బంధు కేవలం హుజురాబాద్లో ఏర్పాటు చేస్తామంటే వరంగల్, కరీంనగర్, హైదరాబాద్లో దళితుల మాటేమిటని ప్రభుత్వాన్ని రాజనరసింహ ప్రశ్నించారు.