జీవో 317ని రద్దు చేయాలి: పొన్నం
ABN , First Publish Date - 2021-12-30T23:11:18+05:30 IST
సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్

కరీంనగర్: సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. ఉపాధ్యాయుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్న జీవో 317ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను సొంత జిల్లాల నుంచి బలవంతంగా ఇతర జిల్లాలకు బదిలీ చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం దీన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.