పేదలకు అండగా కాంగ్రెస్: నాగం

ABN , First Publish Date - 2021-12-10T00:23:03+05:30 IST

రాష్ట్రంలో పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీనేనని ఆ పార్టీ

పేదలకు అండగా కాంగ్రెస్: నాగం

నాగర్ కర్నూల్: రాష్ట్రంలో పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీనేనని ఆ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్‌లో  జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  దేశంలో ఆహార భద్రత చట్టం, సమాచార హక్కు చట్టం తీసుకు వచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు.  కాంగ్రెస్ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇచ్చిన మాటపై నిలబడని జూటా కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ను మోసింది కేసీఆర్‌ అని ఆయన పేర్కొన్నారు. Updated Date - 2021-12-10T00:23:03+05:30 IST