టీఆర్ఎస్ లో చేరిన దేవరుప్పుల మండల కాంగ్రెస్ నేత

ABN , First Publish Date - 2021-11-26T20:56:34+05:30 IST

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం మాధాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుర్రం కొమురయ్య టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

టీఆర్ఎస్ లో చేరిన దేవరుప్పుల మండల కాంగ్రెస్ నేత

జనగామ: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం మాధాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్  నాయకుడు గుర్రం కొమురయ్య టిఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు శుక్రవారం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, ఎంపీపీ బస్వ సావిత్రి, మల్లేష్, జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రాంరెడ్డి, మండల నాయకులు, దామోదర్ రెడ్డి, రాంసింగ్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు మడికొండ ఎల్లయ్య, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు మేకపోతుల నర్సింహ, దేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-26T20:56:34+05:30 IST