ఎన్నికల నిబంధనలు ఉల్లఘించిన టీఆర్ఎస్-దాసోజు శ్రావణ్

ABN , First Publish Date - 2021-03-15T00:54:29+05:30 IST

''తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల పరిణామ క్రమాన్ని చూస్తుంటే అసలు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ అనే వ్యక్తి వున్నాడా ?

ఎన్నికల నిబంధనలు ఉల్లఘించిన టీఆర్ఎస్-దాసోజు శ్రావణ్

హైదరాబాద్: ''తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల పరిణామ క్రమాన్ని చూస్తుంటే అసలు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ అనే వ్యక్తి వున్నాడా ? లేదా నిద్రపోతున్నాడా ? '' అన్న అనుమానం కలుగుతోందని  కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.''ఏ బూత్ లదగ్గరికిపోయినా టీఆర్ఎస్ పార్టీ చెందిన వ్యక్తులు కండువాలు కప్పుకొని, గులాబి టోపీలు పెట్టుకొని , ఇష్టారాజ్యంగా పార్టీ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ నిద్రపోతున్నారా ? కేంద్ర ఎన్నికల సంఘం కల్వకుంట్ల ఎన్నికల సంఘం అయ్యిందా ? అని ఆయన  ప్రశ్నించారు.


''రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన హోం శాఖకు మంత్రి మహమూద్అలీ కనీస ఇంగితం లేకుండా ఓటర్లని మభ్యపెట్టె ప్రయత్నం చేశారని అన్నారు. నేను ఉదయం ఎనిమిది గంటలకే ఓటు వేశా, వాణీ దేవికే ఓటు వేశా అని సాక్ష్యాత్ హోమ్ మంత్రి  చెబుతూ వుంటే ఎంత దిగజారుడు తనంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయో అర్ధం అవుతోందన్నారు. ఓటర్లు ఎలా మభ్యపెడుతున్నారో అర్ధం అవుతుంది '' అని  చెప్పుకొచ్చారు. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ఒక ఐఏఎస్ అధికారిగా, రాజ్యంగ పరిరక్షకులు.  కానీ కేసీఆర్ కి కాదు అనే సంగతి గుర్తు చేసుకోవాలి.


హోమ్ మంత్రి మహమూద్ అలీ ఓటు ఏం చేస్తారో చెప్పాలి. ఆయన ఓటుని రద్దు చేస్తారా ? లేదా ?  హోమ్ మంత్రిగా వున్న వ్యక్తే ఇలాంటి మాటలు మాట్లాడటం దుర్మార్గం. హోమ్ మంత్రి తీరే ఈ ఎన్నికల తీరుకు అద్దం పడుతోందని ఆయన దుయ్యబట్టారు. ఓటుకు రూ. 5వేల నుండి రూ. 10వేల వరకూ పంచుతున్నారు ముందే చెప్పాం. కానీ దాన్ని ఆపలేదు. పోలింగ్ రోజున  కుడా విచ్చల విడిగా డబ్బులు పంచారని ఆయన ఆరోపించారు.

Updated Date - 2021-03-15T00:54:29+05:30 IST