అడ్వకేట్లుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మేలు సున్నా: దాసోజు శ్రవణ్

ABN , First Publish Date - 2021-03-04T21:44:55+05:30 IST

న్యాయవాద దంపతుల హత్య కేసులో కేటీఆర్, కేసీఆర్ లు మొసలికన్నీరు కారుస్తున్నారని ఏఐసిసి అధికార అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు.

అడ్వకేట్లుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మేలు సున్నా: దాసోజు శ్రవణ్

హైదరాబాద్: న్యాయవాద దంపతుల హత్య కేసులో కేటీఆర్, కేసీఆర్ లు మొసలికన్నీరు కారుస్తున్నారని ఏఐసిసి అధికార అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య అని,  వామనరావు పై కేసీఆర్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. కానీ కోర్టు కేసుని స్వీకరించలేదు. ఈ పరిణామం జరిగిన కొద్దిరోజుల్లోనే న్యాయవాద దంపతలు హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని న్యాయవాదుల ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగ భర్తీలు , న్యాయవాదుల సమస్యలపై  దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ఉద్యోగ ఖాళీలు, భర్తీలు అనే అంశంపై బహిరంగ చర్చకు మంత్రి కేటీఆర్ రావాలని సవాల్ చేశాం.


కానీ కేటీఆర్ చర్చకు వచ్చే సాహసం చేయలేదు. అయినప్పటికీ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని కేటీఆర్ ఒప్పుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నాం. ఐతే కేటీఆర్ కి ఒక సూటి ప్రశ్న. గత ఏడేళ్ళు నుండి నేటి వరకూ ఖాళీగా వున్నాయని మీరే చెబుతున్నా ఒక లక్షా తొంబై ఒక్కవేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదో దానికి కారణాలు, సమాధానాలు కూడా చెప్పండి. అసలు మీకు ఉపాధి కల్పనపై మీకు ఒక పాలసీ అంటూ లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే కమిట్మెంట్ మీకు లేదు'' అని ధ్వజమెత్తారు దాసోజు శ్రవణ్.


Updated Date - 2021-03-04T21:44:55+05:30 IST