అధిష్ఠానం నిర్ణయాల వల్లే కాంగ్రెస్‌ బలహీనం

ABN , First Publish Date - 2021-01-12T08:57:09+05:30 IST

అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులకు, కనీసం డిపాజిట్‌

అధిష్ఠానం నిర్ణయాల వల్లే కాంగ్రెస్‌ బలహీనం

నా కృషిని గుర్తించడంలేదు: రాజగోపాల్‌రెడ్డి 


హయత్‌నగర్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులకు, కనీసం డిపాజిట్‌ కూడా రానివారికి రాష్ట్ర పార్టీ బాధ్యతలను అప్పగించడమేంటని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు లింకు పెట్టి పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని ఆపడం ఏమిటన్నారు. ఒడిసా, తమిళనాడు నాయకులకు ఇక్కడి పరిస్థితి ఏం తెలుస్తుందని పరోక్షంగా ఆర్‌సీ ఖుంటియా, మాణిక్కం ఠాగూర్‌లను ఉద్దేశించి అన్నారు. ఇక్కడ నాయకులను గుర్తించి వారికి భాద్యతలు అప్పగిస్తే బాగుంటుందన్నారు. పార్టీ అభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషిని అధిష్ఠానం గుర్తించడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతున్న సమయంలో కూడా తాను ఎమ్మెల్యేగా గెలిచానని, భువనగిరి ఎంపీని గెలిపించుకున్నామని తెలిపారు. 


Updated Date - 2021-01-12T08:57:09+05:30 IST