కాంగ్రెస్‌కి ఓనర్స్‌ లేరు: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-22T00:53:41+05:30 IST

‘‘కాంగ్రెస్‌కి ఓనర్‌ లేరు. ఎవరి కష్టపడితే వాళ్లే ఓనర్స్‌. కష్టపడటానికి సిద్ధంగా ఉండండి. కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తాం’’ అని

కాంగ్రెస్‌కి ఓనర్స్‌ లేరు: రేవంత్‌రెడ్డి

శంషాబాద్‌: ‘‘కాంగ్రెస్‌కి ఓనర్‌ లేరు. ఎవరి కష్టపడితే వాళ్లే ఓనర్స్‌. కష్టపడటానికి సిద్ధంగా ఉండండి. కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తాం’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని మైఫెయిర్‌ కన్వెన్షన్‌ హాల్లో శనివారం యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డితో పాటు ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, షబ్బీర్‌ అలీ, మల్లు రవి, సంపత్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఎంతో మంది పెద్ద నాయకులయ్యారు. వైఎస్సార్‌, చంద్రబాబు, కేసీఆర్‌ లాంటి ఎంతో మంది నేతలను యూత్‌ కాంగ్రెస్‌ అందించిందని తెలిపారు. 

Updated Date - 2021-08-22T00:53:41+05:30 IST