ఇన్నాళ్లూ కష్టపడ్డాం.. ఇక ఎదురు తిరుగుడే
ABN , First Publish Date - 2021-06-28T08:25:32+05:30 IST
కాంగ్రెస్ కార్యకర్తలు ఇన్నాళ్లూ కష్టాలు పడ్డారని, ఇప్పుడు ఆ కష్టాన్ని తిరుగుబాటుగా మార్చాలని టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కే సంస్థాగత బలం
- రాష్ట్రంలో, కేంద్రంలోనూ అధికారంలోకి
- అంతర్గత కలహాలు నెట్ ప్రాక్టీస్ లాంటివి
- ప్రత్యర్థిపై ఆటలో అందరం కలిసే పోరాడతాం
- 7న టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ
- అధ్యక్షుడిగా వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు
- పాదయాత్రపై పార్టీయే నిర్ణయిస్తుంది
- ఎన్టీఆర్, వైఎస్ఆర్పై విమర్శలు వికృత చర్య
- మోదీ గడ్డం పెంచి సన్యాసి అవతారం ఎత్తారు
- మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ వ్యాఖ్యలు
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ కార్యకర్తలు ఇన్నాళ్లూ కష్టాలు పడ్డారని, ఇప్పుడు ఆ కష్టాన్ని తిరుగుబాటుగా మార్చాలని టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. వారికి తాను అండగా ఉంటానన్నారు. సంస్థాగతంగా టీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ బలమైనదని, త్వరితగతిన పుంజుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గత కలహాలు నెట్ ప్రాక్టీసు లాంటివని, ప్రత్యర్థిపై ఆటలో అందరం కలిసే పోరాడతామని అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. టీపీసీసీ చీఫ్‌గా జూలై 7న బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. పార్టీగా సమష్టి నిర్ణయాలే తీసుకుంటామని, వ్యక్తిగత నిర్ణయాలు ఉండబోవని అన్నారు.
రేవంత్‌రెడ్డి నియామకంపై సంబురాలు
వరంగల్ సిటీ: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించడంతో వరంగల్ అర్బన్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. అర్బన్, రూరల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తన నివాసంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. వరంగల్ వెంకట్రామా జంక్షన్లో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. ఎల్కతుర్తిలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ధర్మసాగర్, వేలేరులో స్వీట్లు పంపిణీ చేశారు. కాగా, కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడైన అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం పలువురు నాయకులు, కార్యకర్తలు తనకు అభినందనలు తెలిపిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని, ఎప్పుడన్నది పార్టీయే నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రస్తుత రాజకీయాలకు ఎన్టీఆర్, వైఎ్‌సఆర్‌లు అతీతులని, వారిని విమర్శించడం వికృతమైన చర్య అని అన్నారు. వైఎ్‌సఆర్ చివరి నిమిషం వరకూ కాంగ్రె్సవాదిగానే ఉన్నారని, ఆయన కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఎంఐఎం బలం ఎంతో.. బీజేపీ బలం కూడా అంతేనని అన్నారు. లింగోజిగూడ వ్యవహారంలో ప్రగతి భవన్‌కు వెళ్లిన బీజేపీ నేతలపై ఆ పార్టీ కమిటీ నివేదిక ప్రకారం ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో బండి సంజయ్ చెప్పాలన్నారు. అయోధ్య భూముల వ్యవహారంలో రాముడినీ బీజేపీ వాళ్లు తెగనమ్ముకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఇప్పుడు గడ్డం పెంచి సన్యాసి అవతారమెత్తారని వ్యాఖ్యానించారు.
టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్‌రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. జిల్లాల నుంచి నేతలు, అభిమానులు తరలివచ్చారు. వారితో రేవంత్ క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పార్టీ నేతలు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్ తదితరులు కూడా రేవంత్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్లను కలిసే కార్యక్రమాన్ని రేవంత్ కొనసాగిస్తున్నారు. ఆదివారం మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలిసింది.
