‘నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..’ ఎమ్మెల్సీ ఫలితాలపై దాసోజు స్పందన

ABN , First Publish Date - 2021-03-21T22:22:07+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ చేసిన ట్వీట్...

‘నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..’ ఎమ్మెల్సీ ఫలితాలపై దాసోజు స్పందన

ఇంటర్నెట్ డెస్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఫలితాల అనంతరం ఆయన ‘నిగ్గుదీసి అడుగు సిగ్గులేని జనాన్ని’ అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటను ట్వీట్ చేశారు. ‘‘శాసనాలు చేసేటోడే నీతి తప్పి డబ్బులు పంచుతుంటే, పాఠాలు చెప్పే పంతుళ్లు మందులకు, విందులకు లొంగిపోతుంటే, పట్టాలు పట్టుకున్న పట్టభద్రుడు పైసలకు అమ్ముడుపోతుంటే, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం కాదా?, అజ్ఞానులు విజేతలైతే విజ్ఞానం సమాధి కాదా?, ధర్మం ఓటమి చెందితే, అధర్మం రాజ్యమేలదా?’’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. డబ్బు, మందు, విందుకు జనం దాసోహమయ్యారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.   Updated Date - 2021-03-21T22:22:07+05:30 IST