షర్మిల పార్టీ వల్ల టీఆర్‌ఎస్‌కే నష్టం: భట్టి విక్రమార్క
ABN , First Publish Date - 2021-03-25T01:42:40+05:30 IST
షర్మిల పార్టీ వల్ల టీఆర్‌ఎస్‌కే నష్టం: భట్టి విక్రమార్క

హైదరాబాద్: సాగర్ ఎన్నికల తర్వాత పీసీసీ మార్పు ఉంటుందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. పీసీసీ చీఫ్ ఎంపికపై సోనియాదే నిర్ణయమన్నారు. షర్మిల పార్టీ వల్ల టీఆర్‌ఎస్‌కే నష్టమని చెప్పారు. జానారెడ్డి గెలిస్తే పీసీసీ రేసులోకి వస్తాడని తనకు అవగాహన లేదన్నారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీలోనే ఉంటాడని ఆశిస్తున్నాని వ్యాఖ్యానించారు.