పీఆర్‌సీలో స్పష్టత కరువు

ABN , First Publish Date - 2021-03-24T05:35:53+05:30 IST

పీఆర్‌సీలో స్పష్టత కరువు

పీఆర్‌సీలో స్పష్టత కరువు

 టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాజమల్లయ్య

కాటారం, మార్చి 23: సీఎం కేసీఆర్‌ ప్రకటించిన పీఆర్‌సీలోని పలు అంశాలపై పూర్తి స్థాయి స్పష్టత లోపించిందని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మీస రాజమల్లయ్య అన్నారు. కాటారం  నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా మంగళవారం న ఇర్వహించిన టీపీటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిక్సేషన్‌ తేదీ, హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లపై అస్పష్టంగా ఉందన్నారు. పీఆర్‌సీ ఏరియర్స్‌ను 2018 జూలై 1 నుంచి చెల్లిస్తూ వాటిని వెంటనే ఉద్యోగులకు అందేలా చూడాలన్నారు. సీపీఎస్‌ ఉపాధ్యాయులకు ఫ్యామిలీ పెన్షన్‌ కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని, సీపీఎ్‌సను పూర్తిగా రద్దు చేసి ఓపీఎ్‌సను పునరుద్ధరించాలన్నారు. పాఠశాలల్లో పారిశుధ్య సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సేవానాయక్‌, జిల్లా బాధ్యులు గండు రాజబాబు, కుమారస్వామి, గంట రాజబాబు, జయరాజ్‌, సురేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-03-24T05:35:53+05:30 IST