టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలపై ఫిర్యాదులు
ABN , First Publish Date - 2021-10-28T23:35:34+05:30 IST
టీఆర్‌ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీలపై ప్రజల నుంచి జీహెచ్‌ఎంసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నామమాత్రపు చర్యలతో జీహెచ్‌ఎంసీ చేతులు దులుపుకుంటోంది.

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీలపై ప్రజల నుంచి జీహెచ్‌ఎంసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నామమాత్రపు చర్యలతో జీహెచ్‌ఎంసీ చేతులు దులుపుకుంటోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు రూ.30 వేల జరిమానా చేశారు. మంత్రి తలసానికి 5 వేలు మాత్రమే ఫైన్ విధించారు. గత 5 రోజులుగా జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సర్వర్ పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రజల ఆగ్రహం నేపథ్యంలో ఎట్టకేలకు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు.