హుజూరాబాద్‌లో పోటీ చేయం: చాడ

ABN , First Publish Date - 2021-09-02T10:02:56+05:30 IST

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో సీపీఐ పోటీ చేయదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు...

హుజూరాబాద్‌లో పోటీ చేయం: చాడ

భీమదేవరపల్లి, సెప్టెంబరు 1: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో సీపీఐ పోటీ చేయదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలో పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి హుజూరాబాద్‌లో ఏ పార్టీకి మద్దతివ్వాలో నిర్ణయిస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేట్‌ పరం చేస్తోందని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. ప్రజా దగా యాత్ర అని విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ సాహిత్య పోరాట వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2021-09-02T10:02:56+05:30 IST