త్వరలోనే టీ-హబ్2 ప్రారంభం: కేటీఆర్
ABN , First Publish Date - 2021-04-11T08:51:24+05:30 IST
రాయదుర్గంలో నిర్మాణంలో ఉన్న టీ-హబ్-2ను త్వరలోనే ప్రారంభించనున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): రాయదుర్గంలో నిర్మాణంలో ఉన్న టీ-హబ్-2ను త్వరలోనే ప్రారంభించనున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. శనివారం టీ-హబ్-2 పనులను పరిశీలించిన కేటీఆర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. రూ.276 కోట్లతో 3.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు.