కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం

ABN , First Publish Date - 2021-11-23T17:16:24+05:30 IST

గల్వాన్ ఘటనలో అమరుడైన వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం లభించింది.

కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం

న్యూఢిల్లీ:  గాల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కార ప్రదానం జరిగింది. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో పరమవీర చక్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహావీర చక్ర పురస్కారాన్ని సంతోష్ బాబు కుటుంబ సభ్యులు తల్లి, భార్యకు అందజేశారు. గతేడాది జూన్‌లో తూర్పు లద్దాఖ్ గల్వాన్ వ్యాలీలో చైనా ఆర్మీ దాడిని ప్రతిఘటించిన ఘటనలో కల్నల్ సంతోష్ బాబు అమరుడైన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-11-23T17:16:24+05:30 IST