కాళేశ్వరాలయంలో కలెక్టర్‌, ఎస్పీ పూజలు

ABN , First Publish Date - 2021-02-28T05:13:51+05:30 IST

కాళేశ్వరాలయంలో కలెక్టర్‌, ఎస్పీ పూజలు

కాళేశ్వరాలయంలో కలెక్టర్‌, ఎస్పీ పూజలు
కలెక్టర్‌ దంపతులకు శేషవస్త్రాలను బహూకరిస్తున్న ఈవో

మహదేవపూర్‌, ఫిబ్రవరి 27: మండలంలోని కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శనివారం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌లు కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చక్రస్నానం కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్‌, ఎస్పీ ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన వారికి ఈవో మారుతి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ శేషవస్త్రాలతో సన్మానించారు.

Updated Date - 2021-02-28T05:13:51+05:30 IST