ఘనంగా అమృతోత్సవం

ABN , First Publish Date - 2021-03-25T05:28:58+05:30 IST

ఘనంగా అమృతోత్సవం

ఘనంగా అమృతోత్సవం
నర్సంపేట మినీ స్టేడియంలో ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ హరిత

జిల్లాలో 75 వారాల పాటు కార్యక్రమాలు

కలెక్టర్‌ హరిత

నర్సంపేట, మార్చి 24: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా 75 వారాల పాటు ఆజాది కా అమృతోత్సవ్‌ వేడుకలు కొనసాగుతాయని కలెక్టర్‌ హరిత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్పోర్ట్స్‌ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా యూత్‌, స్పోర్ట్స్‌ కార్యాలయ అధికారి ఇందిర ఆధ్వర్యంలో బుధవారం నర్సంపేటలోని మినీ స్టేడియంలో ఆజాది కా అమృత్‌ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మినీ స్టేడియం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో 75 వారాల పాటు ఆజాది కా అమృతోత్సవ వేడుకలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతీ ఒక్కరు పాల్గొని దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో హ్యాండ్‌బాల్‌ కోచ్‌ సత్యవాణి, జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ డాక్టర్‌ పుల్లూరి శ్రీనివాస్‌గౌడ్‌, ఆర్‌డీవో పవన్‌కుమార్‌, తహసీల్దార్‌ రాంమూర్తి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రమౌళి, ఆర్‌ఐ రాజు, మినీ స్టేడియం ఇన్‌చార్జి, కబడ్డీ కోచ్‌ యాట రవికుమార్‌, అథ్లెటిక్‌ కోచ్‌ ఈసాల లక్ష్మయ్య, రెజ్లింగ్‌ కోచ్‌ జానీ, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాలకుర్తి శ్రీనివాస్‌, కృష్ణ, సుధీర్‌, యాదగిరి, మిత్ర క్లబ్‌ సభ్యులు చుక్క అనిల్‌, ఎర్రబోయిన కిషన్‌, విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T05:28:58+05:30 IST