ల్యాండ్‌ పూలింగ్‌ను పారదర్శకంగా చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-08-28T05:18:30+05:30 IST

ల్యాండ్‌ పూలింగ్‌ను పారదర్శకంగా చేయాలి: కలెక్టర్‌

ల్యాండ్‌ పూలింగ్‌ను పారదర్శకంగా చేయాలి: కలెక్టర్‌

వరంగల్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 27: కుడాకు సంబంధించిన ల్యాండ్‌ పూలింగ్‌ విషయంలో కుడా అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ హరిత సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో ల్యాండ్‌ పూలింగ్‌పై కుడా అధికారులతో సమావేశం నిర ్వహించారు.కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, పీవో అజిత్‌రెడ్డి, ఆర్‌డీవో మహేందర్‌జీతో వరంగల్‌ జిల్లాకు సంబంధించి కుడా పరిధిలోని ల్యాండ్‌ పూలింగ్‌పై చర్చించారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ  ల్యాండ్‌ పూలింగ్‌లో ప్రభుత్వలా, ప్రైవేటు భూముల అన్నది క్షుణ్ణంగా గుర్తించారని ఆర్‌డీవోను ఆదేశించారు. మునిసిపల్‌ శాఖ మంత్రి కె. తారకరామారావు సూచన మేరకు హెచ్‌ఎండీఏ తరహాలో ల్యాండ్‌ పూలింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉందని చైర్మన్‌ యాదవరెడ్డి అన్నారు. భూములను కుడా దౌర్జనంగా సేకరిస్తోందని కొందరు దళారులు ప్రచారం చేస్తున్నారని యాదవరెడ్డి చెప్పారు. దీనిని విశ్వసించవద్దన్నారు. నేరుగా కుడా కార్యాలయాన్ని సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు.కార్యక్రమంలో అజిత్‌రెడ్డి, ఆర్‌డీవో మహేందర్‌జీ పాల్గొన్నారు.

దేవాదుల ప్రాజెక్టు అవార్డు ప్రక్రియను పూర్తి చేయాలి

 ప్రాధాన్యత క్రమంలో దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి అవార్డు(భూ పరిహారం) ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌ హరిత అన్నారు. శుక్రవారం దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ల్యాండ్‌ సేకరణ, పరిహారం చెల్లింపుపై సంబంధిత అధికారులతో తన చాంబర్‌లో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమైన ప్యాకేజీ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు 265ఎకరాల భూ సేకరణ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 208 ఎకరాలకు సర్వే పూర్తి అయిందని, 80 ఎకరాలకు సంబంధించిన రైతులకు నష్ట పరిహారం చెల్లింపులు జరిగాయని తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఆర్‌డీవో మహేందర్‌జీ, దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన డీఈలు, ఏఈలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T05:18:30+05:30 IST