పాఠశాలలు, వసతి గృహాలను శుభ్రంగా ఉంచాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2021-01-13T03:49:59+05:30 IST
పాఠశాలలు, వసతి గృహాలను శుభ్రంగా ఉంచాలి: కలెక్టర్

వరంగల్ రూరల్ కల్చరల్, జనవరి 12: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో సంక్షేమ విద్యాశాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పాఠశాలలు, కేజీవీబీ మోడల్ స్కూల్స్, సంక్షేమ హాస్టళ్లల్లో పరిసరాలను చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ అధికారులతో సమన్వయపర్చి పాఠశాలల ఆవరణ ప్రతీ రోజు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మధ్యా హ్న భోజనానికి కావాల్సిన సరుకులను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.మహేందర్‌రెడ్డి, డీపీవో చంద్రమౌళి, డీఈవో వాసంతి, బీసీ డెవల్‌పమెంట్ అధికారి నర్సింహస్వామి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జనార్దన్ పాల్గొన్నారు.