మెడికల్ కళాశాల పనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-12-31T20:17:55+05:30 IST
జిల్లా కేంద్రంలో నిర్మితమవుతున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు.

కలెక్టర్ శశాంక
మహబూబాబాద్ టౌన్, డిసెంబరు 30 : జిల్లా కేంద్రంలో నిర్మితమవుతున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. మహబూబాబాద్ పట్టణంలోని 551 సర్వే నంబర్‌లోని 30 ఎకరాల్లో చేపట్టిన మెడికల్ కళాశాల అనుబంధ నర్సింగ్ కళాశాల పనులను గురువారం పరిశీలించారు. నిర్ధేశించిన సూచనల మేరకు నర్సింగ్ కళాశాల పనులు ఆశించిన మేర కు వేగవంతం జరగడం లేదని అధికారులు పర్యవేక్షిస్తూ నిర్ణీత కాలంలో పూర్తి చే యాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ తానేశ్వర్ పాల్గొన్నారు.