కూలిన పోతిరెడ్డిపాడు సైడ్‌వాల్‌

ABN , First Publish Date - 2021-08-20T09:05:39+05:30 IST

కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ప్రాజెక్టు రక్షణ గోడకు నిర్మించిన సైడ్‌ వాల్‌ కూలిపోయింది. పది రోజుల క్రితం అదే ..

కూలిన పోతిరెడ్డిపాడు సైడ్‌వాల్‌

జూపాడుబంగ్లా, ఆగస్టు 19: కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ప్రాజెక్టు రక్షణ గోడకు నిర్మించిన సైడ్‌ వాల్‌ కూలిపోయింది. పది రోజుల క్రితం అదే ప్రాంతంలో పైభాగాన భారీ రంధ్రం పడగా అధికారు లు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. రంధ్రం పడినచోట కిందిభాగంలో నీటి ఉధృతికి గోడతో పాటు నిర్మించిన మెట్లు కూడా కూలిపోయాయి. నీటి విడుదల నిలిపివేయడంతో ఈ విషయం గురువారం వెలుగుచూసింది. నీటి విడుదల పెంచితే మొత్తం గోడ కూలిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా, గోడ కూలినా ప్రమాదమేమీ లేదని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-08-20T09:05:39+05:30 IST