ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి

ABN , First Publish Date - 2021-12-07T05:36:21+05:30 IST

ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి

ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి
మల్లక్‌పల్లిలో సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌

 ధర్మసాగర్‌, డిసెంబరు 6 : యాసంగిలో వరికి బదులు ఆర్థికంగా లాభవం వచ్చే పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. ధర్మసాగర్‌ మండలం మల్లక్‌పల్లిలో వ్యవసాయశాఖ అధికారి పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన విచ్చేసి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మినుము, పెసర, చిరుధాన్యాలు, ఆయిల్‌ఫాం, కూరగాయలు, పప్పు దినుసుల పంటలు వేయాలని సూచించారు. ప్రతీ మండలానికి ఏవో, ఏఈవో అధికారులున్నారని తెలిపారు. డిమాండ్‌ ఉన్న పంటలను వేసి రైతులు మంచి లాభాలను పొందారన్నారు. అనంతరం అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏడీఏ దామోదర్‌రెడ్డి, సర్పంచ్‌ మునిగెల రాజు, ఎంపీటీసీ కరుణాకర్‌రెడ్డి, విస్తరణ అధికారి పవన్‌కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రజలకు అనుకూలంగా అభివృద్ధి

పరకాల  : ప్రభుత్వం అందించే పథకాలతో ప్రజలకు అనుకూలంగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఓల్డ్‌ సీఎంఎస్‌, డాక్‌ బంగ్లా, కూరగాయల మార్కెట్‌ పరిసరాలను పరిశీలించారు. అదేవిధంగా  ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ మార్కెట్‌, ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్య సదుపాయాలపై వివరాలను తెలుసుకున్నారు. 

కలెక్టర్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ జి.సంధ్యారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ శేషు, చైర్‌పర్సన్‌ సోదా అనిత, వైస్‌ చైర్మన్‌ రేగూరి విజయపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ బండి సారంగపాణి, మడికొండ శ్రీను, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-07T05:36:21+05:30 IST